విద్యార్థులకు గ్లాసులు,మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ
బుచ్చయ్యపేట,,ఐఏషియ న్యూస్: అమెరికా దేశీయుల సహకారంతో, గాజువాక సిఎల్సి చర్చి అధినేత సుధీర్ కే మహంతి ఆధ్వర్యంలో బుధవారం బుచ్చయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్లాసులు, కంచాలు పంపిణీ చేయడంతో పాటు, ఎల్బీపురం, బంగారు మెట్టల మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అలాగే త్రాగునీటి బోర్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ మహంతి అందిస్తున్న సేవలు అభినందనీయమైనవి. అమెరికాలోపుట్టి,భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపడుతున్న డారెల్ నైట్, లియానా, లోక్, లిశాలను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన మహంతి ప్రశంసనీయుడన్నారు.గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి సిఎల్సి చర్చి అధినేత మహంతిని సత్కరించారు. అనంతరం మహంతి మాట్లాడుతూ ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాము. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.అమెరికా నుండి వచ్చిన డారెల్ నైట్, లియానా తదితరులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, ఆచారాలు, వంటకాలు మాకు ఎంతో నచ్చాయి. మీరంతా అభివృద్ధి సాధించినా, మీ సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉండటం మాకు గర్వంగా ఉంది. ఉయ్ లవ్ ఇండియా” అని అన్నారు.
కార్యక్రమంలో సిఎల్సి చర్చి ప్రతినిధి ఆల్ఫ్రెడ్ మహంతి, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ,తమరాన దాసు, టిడిపి మండల యూత్ లీడర్ సాయం శేషు, వడ్డది టిడిపి నాయకులు దొండ గిరిబాబు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.చివరగా ఎమ్మెల్యే రాజు బంగారు మెట్టలో రైతులకు సబ్సిడీపై ఎరువులు పంపిణీ చేశారు.
Authored by: Vaddadi udayakumar