అమరావతి,ఐఏషియ న్యూస్: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్‌గా స్పందించారు.అటవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశారన్నారు. అంతేకాకుండా, వారిని వాహనాల్లో బంధించి, రాత్రంతా రెండు గంటల పాటు శ్రీశైలం అడవుల్లో తిప్పారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యేకు చెందిన గెస్ట్ హౌస్‌లో వారిని బంధించి దాడి చేశారని, వాకీటాకీలు, మొబైల్స్ లాక్కున్నారని సిబ్బంది మీడియాకు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియోలను కూడా అధికారులు విడుదల చేశారు.ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. శాసనసభ్యులు, ఆయన అనుచరుల ప్రమేయంపై సవివరమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారంకేసులునమోదుచేయాలనిస్పష్టంచేశారు.పవన్ కల్యాణ్ ఎక్స్ ( ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ..చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడే ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించబోమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తాము కూడా తప్పు చేస్తే బాధ్యులను చేస్తామని శాసనసభలో స్పష్టంగా చెప్పామన్నారు.ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలని, ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే వారిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.అరెస్టయిన 31వ రోజున పదవి కోల్పోయేలా చట్టం తీసుకురాబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంప్రకటించినవిషయాన్ని కూడా వారు గుర్తు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Authored by: Vaddadi udayakumar