సింహాచలం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి అన్నప్రసాద పథకానికి విజయనగరం జిల్లా, భోగపురం మండలం, ముడసాలపేట గ్రామానికి చెందిన చెల్లిబోయిన నరసింగరావు దంపతులు భక్తిశ్రద్ధలతో 1,00,000 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాధరావు చేతులమీదుగా వీరికి స్వామివారి నిత్య అన్న ప్రసాదం బాండ్ ను అందజేశారు. దాతలు నరసింగరావు దంపతులు స్వామివారి నిత్య అన్న ప్రసాదం పథకంలో శాశ్వత భాగస్వాములు అయ్యారు. దాతకు స్వామివారి దర్శనంఅనంతరము ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.భక్తులకు అన్నప్రసాదాలు నిరంతరం అందించే కార్యక్రమానికి ఈ విరాళం ఎంతో దోహదం కానున్నది. భక్తుల సహకారంతో సాగుతున్న ఈ నిత్య అన్నదాన సేవలో ప్రతిఒక్కరి పాత్ర అపారమైనదని, భక్తులు ఇలాగే ముందుకు వచ్చి దాతృత్వాన్ని ప్రదర్శించాలని ఆలయ అధికారులు ఆకాంక్షించారు.
Authored by: Vaddadi udayakumar