సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి నిత్య అన్నప్రసాదం పథకానికి కె.ఆర్. ఎం కాలనీ విశాఖపట్నంనకు చెందిన బి.మాధవరావు దంపతులు బుధవారం 1,00,001 రూపాయలు నగదు రూపంలో విరాళం అందించారు.ఈ విరాళాన్ని పి.ఆర్.ఓ. ఆఫీసులో గల డొనేషన్ కౌంటర్ వద్ద చెల్లించి రసీదు స్వీకరించారు.దాతకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి పి. సునీల్ కుమార్, పి.ఆర్.ఓ నాయుడు కలిసి దాతకు నిత్య అన్నప్రసాదం సంబంధించిన బాండును అందజేశారు.అనంతరం దాత, వారి కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించగా, వేదపండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చారు.ఆలయ పర్యవేక్షణాధికారి బి.సత్య శ్రీనివాసు దాతకు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి,ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం అధికారులు మాట్లాడుతూ స్వామివారి సేవలో భాగంగా ఇలాంటి దాతృత్వం చూపిన దాతకు దేవస్థానం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది.ఇలాంటి దాతల సహకారంతో నిత్య అన్నప్రసాదం పథకం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar