భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన దుర్గా నవరాత్రి ఉత్సవాలు

ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్:   దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి సందర్భంగా ఆలయాలు పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి. భక్తులు అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వస్తున్నారు. ప్రతీ ప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది.
విజయవాడలో బాలత్రిపురసుందరి దర్శనం
అలంపురి శక్తిపీఠాల్లో ఒకటైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద తొలిరోజు అమ్మవారు బాలత్రిపురసుందరిగా దర్శనమిస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులనుదర్శనానికి అనుమతించారు. మంగళవారం నుండి ఉదయం 4 గంటలకే ఆలయ ద్వారాలుతెరవబడిభక్తులకుదర్శనంకల్పించనున్నారుప్రతిరోజూ అమ్మవారు పలు అలంకారాల్లో భక్తులను కటాక్షించనున్నారు.
భక్తుల రద్దీకి ఏర్పాట్లు..
దసరా ఉత్సవాల సందర్భంగా పెద్దఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలు, తాగునీటి సదుపాయాలు, వైద్య బృందాలను సిద్ధం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా విస్తృత భద్రతా చర్యలు కూడా చేపట్టారు.
గ్రామాల్లోనూ దుర్గాదేవి ఉత్సవాల జోష్..
పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి భక్తులు శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఆధ్యాత్మిక వాతావరణం..
ఈ తొమ్మిది రోజులపాటు భక్తులు ఉపవాసాలు పాటిస్తూ, శ్లోకాలు జపిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రాల్లో శక్తి ఆరాధనకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, భజనలు జరుగుతున్నాయి. భక్తి, ఆనందం, ఆధ్యాత్మికతతో నిండిన వాతావరణం ప్రతిచోటా కనిపిస్తోంది.మరోవైపు విజయవాడలో నేటి నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. అక్టోబరు 2 వరకు ఈ మళ్లింపులు ఉంటాయని వివరించారు.అలానే ఉత్సవాలకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్టు ఎస్ వి స్పష్టం చేశారు.
కనకదుర్గమ్మ దర్శించుకున్న పలువురు ప్రముఖులు
కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవా దశ కమిషనర్ రామచంద్ర మోహన్ అమ్మవారి దర్శించుకుని ఆశీస్సులు పొందారు. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శించుకోవడంతో ఆలయం రద్దీగా మారింది. ఇటువంటి అమాంసంలు జరగకుండా దేవస్థానం,పోలీస్ శాఖ సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ఈవో శీనా నాయక్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.శైలపుత్రిగా శ్రీశైల భ్రమరాంబ భక్తులకు దర్శనం
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయాల్లో కూడా నవరాత్రి దుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు భ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం

వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు ఇల్లినాయిస్‌(యుఎస్),ఐఏషియ న్యూస్:  మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *