విజయవాడ,ఐఏషియ న్యూస్: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో శుక్రవారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన సతీమణి సమీరా నజీర్ తో కలిసి ఇచ్చిన తేనీటి విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్,డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు హాజరయ్యారు.ఇంకా మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు,వివిధ రాజకీయ పార్టీలనాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, పద్మ పురస్కార గ్రహీతలు, పుర ప్రముఖులు, క్రీడాకారులు, మీడియా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar