విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ నగర పరిధిలోగల సాగర్ నగర్‌లోని గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కుమారి పి.కరుణ భారతదేశం నుండి మొదటిసారిగా ప్రపంచ క్రికెట్ జట్టులోకి ఎంపికైంది.ప్రపంచంలోనే తొలిసారిగా బాలికల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఆడబోతోంది. గతంలో, బ్లైండ్ బాలుర క్రికెట్ జట్టు ఉండేది, కానీ ఇప్పుడు మహిళా బ్లైండ్ గర్ల్స్ క్రికెట్ జట్టు మొదటిసారి క్రికెట్ ఆడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన కుమారి కరుణ భారతదేశం నుండి పదహారుమంది బాలికల జట్టులో ఎంపికైనందుకు నగరంలోని వేలాది మంది ఆమెను అభినందించారు.గత ముప్పై ఐదు సంవత్సరాలుగా, నగర పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త కమల్ బైద్ సహకారం పాఠశాల అభివృద్ధిలో కొనసాగుతోంది. రాబోయే నవంబర్‌లో నేపాల్‌లో జరగనున్న ప్రపంచ కప్‌లో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్ మరియు నేపాల్ నుండి మొత్తం ఆరుజట్లుపాల్గొంటాయి.మంగళవారం, సాగర్ నగర్ గవర్నమెంట్ విజువల్య్ హ్యాండీక్యాప్డ్ స్కూల్లో కమల్ బైద్ కుమారి కరుణను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా, రోటేరియన్లు జిఎస్ రాజు, రామకృష్ణతో పాటు ప్రిన్సిపాల్ విజయ, మాజీ ప్రిన్సిపాల్ ప్రకాష్ రావుతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.
Authored by: Vaddadi udayakumar