మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 150 కోట్లు మంజూరు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది, 2026 జనవరిలో ఘనంగా జరగనుంది. ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ జాతర నిర్వహణతో పాటు శాశ్వత నిర్మాణాల కోసం గిరిజన సంక్షేమ శాఖ ఏకంగా రూ. 150 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరకు కేటాయించిన అత్యధిక మొత్తం అని మంత్రి సీతక్క తెలిపారు.
జాతర తేదీలు, ప్రాధాన్యత..
మంత్రి సీతక్క ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ఆదివాసీల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె అన్నారు. రెండు సంవత్సరాలకొకసారి జరిగే ఈ జాతర తేదీలను పూజారుల సంఘం ఇప్పటికే ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వచ్చే ఏడాదిజనవరి 28, బుధవారం నాడు.. సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. జనవరి 29 గురువారం రోజున సమ్మక్క గద్దెపైకి చేరిక జరుగుతుంది. జనవరి 30 శుక్రవారం నాడు భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులుతీర్చుకోవచ్చు.. ఆ తర్వాత జనవరి 31, శనివారం రోజున సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు తిరిగి వన ప్రవేశం చేస్తారు.ఈసారి జాతర పండుగను మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా నిర్వహించడానికి అధికారులు అన్ని రకాలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. గిరిజన సంస్కృతి, వారసత్వానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని మరోసారి రుజువు అయింది. మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఎంతో ఘటన చరిత్రఉంది. కాకతీయులపైనే విరోచితంగా పోరాడిన ఘనమైన చరిత్ర వీళ్లది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం

అమరావతి,ఐఏషియ న్యూస్: వినాయక చవితిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా యువత, ఉత్సవ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *