పార్వతీపురం,ఐఏషియ న్యూస్: కలెక్టర్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటుచేసిన రెవిన్యూ క్లినిక్ ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. రెవిన్యూ సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటుచేసిన వివిధ విభాగాలను ఆమె ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది తో కలిసి పరిశీలించారు. రెవిన్యూ క్లినిక్ విచ్చేసిన అర్జీదారులతో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Authored by: Vaddadi udayakumar