తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలలో విషాదఛాయలు
వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు. అదే కుటుంబంలో మరి కొంతమందికి గాయాలయ్యాయి. ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ ఢీ కొట్టడంతో తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరికొందరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తతో మంచిర్యాల లోని రెడ్డి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కూతురి గృహ ప్రవేశానికి అమెరికా వెళ్లి అక్కడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఆ కుటుంబం. అప్పటివరకూ హాయిగా నవ్వుతూ సాగిన వారి జర్నీ విషాదంగా ముగిసింది. తమ బిడ్డల్ని చూసేందుకు మంచిర్యాల నుంచి సంతోషంగా అమెరికాకు వెళ్లిన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.ఆకుటుంబంప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ ఢీ కొట్టడంతో తల్లీ కూతురు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలోని మిగతావారు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతోంది.
మంచిర్యాలలోని రెడ్డి కాలనీకు చెందిన విశ్రాంత సింగరేణి కార్మికుడు పి. విఘ్నేష్ కు స్రవంతి, తేజస్వి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికి వివాహాలు అయ్యాయి. కుమార్తెలిద్దరూ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే తేజస్వి గృహ ప్రవేశం సందర్భంగా గత నెల 18న విగ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికా వెళ్లాడు.అక్కడే కుమార్తెలతో హాయిగా గడిపారు. అయితే శుక్రవారం పెద్ద కూతురి కుమారుడు నిశాంత్ బర్త్ డే సందర్భంగా విఘ్నేష్ తో పాటు రమాదేవి, తేజస్వి కారులో బయల్దేరారు.అయితే మార్గ మధ్యలో వారు ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో తల్లి రమాదేవి,కుమార్తె తేజస్వి మృతి చెందారు. ఇతర కుటుంబ సభ్యులు గాయపడ్డారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar