విజయనగరం,ఐఏషియ న్యూస్: శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను ఈనెల 9వ తేదీన ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. గోవా గవర్నర్, మాన్సాస్ చైర్మెన్ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి చేతులమీదుగా ఈ పనులను ప్రారంభిస్తామని చెప్పారు.శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా, అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఆనం పట్టువస్త్రాలను సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనాలు పలికి, అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ విజయనగరంలోని మూడు లాంతర్లు కూడలిలో వెలసిన ఈ అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, పూసపాటి రాజవంశీయుల ఇష్టదైవంగా అమ్మవారు ఆరాధింపబడుతున్నారు అంటే అమ్మవారి గొప్పతనం ఏంటో అర్ధం అవుతుందని పేర్కొన్నారు.1758లో ప్రారంభమైన సిరిమానోత్సవం, నేటికీ అదే ఉత్సాహంతో, అదే విశ్వాసంతో సాగుతోందని,ప్రతి ఏడాది లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తమ కోరికలు నెరవేరేలా ప్రార్థనలు చేస్తారని, ఈ ఉత్సవం కేవలం భక్తి పండుగ మాత్రమే కాదు,ఉత్తరాంధ్ర ఆత్మ విశ్వాసం ప్రతిబింబించే సాంస్కృతిక వేడుకగా కూడా నిలిచిందని చెప్పొచ్చు అన్నారు.ఈ ఏడాది అమ్మవారి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవం గా ప్రారంభం అయ్యాయని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడ అమ్మవారు జాతర ను రాష్ట్ర పండుగ గా గుర్తించి తనను నేడు దేవాదాయ శాఖ మంత్రి హోదాలో పట్టువస్త్రాలుసమర్పించడానికి పంపిందని,తనకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం అనేది పూర్వజన సుకృతంగా భావిస్తున్నానన్నారు.రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిందని ,పెద్దఎత్తున భద్రతా సిబ్బందిని నియమించడం, అలాగే త్రాగునీటి, వైద్య, రవాణా, పారిశుధ్య సదుపాయాలు కల్పించడం, సుదుర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణ కొరకు కూడ ప్రత్యేక చర్యలు తీసుకోవడం, అలాగే మహిళలు, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వంటి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.అలాగే ప్రస్తుతం ఈ ఆలయం భక్తులకు దర్శనం విచ్చేసిన సందర్భంలో చిన్న ప్రాకారం ఉండటం వలన తాము భక్తుల భద్రతను గుర్తించి కోటి 80 లక్షల రూపాయలు మంజూరు చేయడమైనది ఇందులో భాగంగా సిజిఎఫ్ గ్రాండ్ రూ.1,44,000/- లు మంజూరు చేయడం జరిగిందని, పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం ఆలయ పునర్నిర్మాణం ముఖ్యంగా అంతరాలయం, ప్రాకార మండపం, అనివెట్టి మండపం పునర్నిర్మాణ పనులను గురువారం పూసపాటి అశోక్ గజపతి రాజు చైర్మన్ చే శంకుస్థాపన పనులు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారుఅలాగే ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆలయ అభివృద్ధి దృష్ట్యా అత్యవసరముగా ఆలయం చుట్టుపక్కల భూముల బదలాయింపులు లేక కొనుగోలుపై స్థలములను తీసుకొనుటకు తగు ప్రపోజల్స్ చేయవలసిందిగా కార్యనిర్వాణాహధికారికి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందనీ తెలిపారు.మంత్రి వెంట జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత, ఎం.ఎస్.ఎం.ఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్,ఎం.పి కలిశెట్టి అప్పలనాయుడు,ఎం.ఎల్.సి కావలి గ్రీష్మ ,శాసన సభ్యులు అదితి గజపతి రాజు, జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar