ఐపీఎస్ అధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు
పంజాబ్,ఐఏషియ న్యూస్: పంజాబ్ లోని రోపార్ రేంజ్ డి ఐ జి 2009 బ్యాచ్ హర్చరణ్ సింగ్ భుల్లర్ ను సిబిఐ అరెస్టు చేసింది.8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్ చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి 5 కోట్ల నగదు, 1.5 కేజీల జువెలరీ, 22 లగ్జరీ వాచ్లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్ అండ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి కావడంతో శనివారం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
Authored by: Vaddadi udayakumar