శ్రీశైల మల్లన్న ను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలం,ఐఏషియన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం చేరుకున్నారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం  శ్రీశైలం చేరుకున్న సీఎం ముందుగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాల్లో వచ్చిన ముఖ్యమంత్రికి పూలదండ వేసి ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ఆహ్వానించారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శ్రీశైలం బయల్దేరారు. శ్రీశైలం చేరుకున్న చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర రెడ్డి, అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. హెలికాప్టర్ నుంచి దిగిన సీఎం నేరుగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి చేరుకున్నారు.ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా శ్రీశైలం చేరుకున్నారు. జలహారతి కార్యక్రమం అనంతరం నీటి వినియోగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించనున్నారు.

  • కృష్ణమ్మకు జలహారతి దిగువకు నీరు విడుదల

ముందుగా శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జలాశయం వద్దకు చేరుకుంటారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా కృష్ణమ్మకు హారతి ఇస్తారు. తొలి ఏకాదశి నుంచి రైతులు దుక్కులు దున్ని పంటలు వేసుకునే సమయం కావడంతో ప్రతి ఏడాది ఈ జలహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది ఇప్పటికే కళకళలాడుతోంది. శ్రీశైలంలోని కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణ, గోదావరి నదులు జలకళను సంతరించుకున్నాయి. సుంకేశుల, జూరాల నుంచి వరద నీరు శ్రీశైలానికి జలాశయానికి పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.6 అడుగులకు నీరు చేరింది. పై నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమం అనంతరం అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు.

About admin

Check Also

అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం

వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు ఇల్లినాయిస్‌(యుఎస్),ఐఏషియ న్యూస్:  మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *