విశాఖ క్రైమ్,ఐఏసియన్ న్యూస్: ముందుగా రాబడిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రోడ్ లో డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు. సౌత్ ఆఫ్రికా కు చెందిన థామస్ డ్జిమోన్ తో పాటు విశాఖకు చెందిన అక్షయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వీరి వద్ద నుంచి ఒక కార్,3.6 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు,ఒక డైరీ స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న కొకెయిన్ విలువ 10 నుంచి 15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. నిఘవర్గాలు సమాచారం మేరకు ఈగల్ టీం,విశాఖ పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్ ని పట్టుకున్నారు. థామస్ డ్జిమోన్ ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అక్షయ్ కు ఇస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది.అక్షయ్ ని విచారించి గా ఢిల్లీకి చెందిన కొంతమంది పేర్లు చెప్పారు.వీరి కోసం ఢిల్లీ కి పోలీస్ బృందాలను పంపించామని,డ్రగ్స్ రాకెట్ పై లోతైన విచారణ చేపడుతున్నామనివిశాఖ నగర సిపి శంఖబ్రాత బాగ్చి శనివారం మీడియాకు తెలియజేశారు.
Check Also
విశాఖలో మహిళ దారుణ హత్య: నిందితుడు అరెస్ట్
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: విశాఖనగరంలోని అక్కయ్యపాలెం, నందగిరినగర్ ప్రాంతంలో నడిరోడ్డుపై మహిళ హత్య జరిగిన ఘటన బుధవారం విశాఖ నగరం …