నేడు దామోదర ద్వాదశి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి సాల గ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి అలాంటి సాలగ్రామాలు గండకీ నది’ లో విరివిగా లభిస్తాయి సహజ సిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలు కొన్ని పుణ్యక్షేత్రాల్లో కొనుగోలు చేయ డానికి అందుబాటులో వుంటాయి ఎంతో విశిష్టతను సంతరించుకున్న సాలగ్రామాన్ని ‘శ్రావణ శుద్ధ ద్వాదశి’ రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబు తున్నాయి అందుకు కారణం శ్రావణ శుద్ధ ద్వాదశి ‘దామోదర ద్వాదశి’ గా పిలవబడుతూ ఉండటమే ఏకాదశిన ఉపవాసం చేసిన వాళ్లు దామోదర ద్వాదశి రోజున ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు.ఈ రోజున శ్రీమహావిష్ణువును వివిధ రకాల పూల మాలికలతో అలంకరించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాభి షేకాలు నిర్వహించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి మహా విశిష్టమైన ఈ రోజున శ్రీమహా విష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిదని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఒకవేళ సాలగ్రామం లభించని పక్షంలో శ్రీమహావిష్ణువు వెండి ప్రతిమను దానంగా ఇవ్వ వచ్చని అంటోంది దామోదర ద్వాదశి  రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొంద డానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది.Authored by: Vaddadi udayakumar

 

About admin

Check Also

అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం

వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు ఇల్లినాయిస్‌(యుఎస్),ఐఏషియ న్యూస్:  మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *