రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఈనెల 25వ తేదీ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయని తెలిపారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
నాలుగు కోట్ల మందికి రేషన్, గ్యాస్ రాయితీ విషయంలో కూడా
రేషన్ షాప్ ల ద్వారానే gcc ఉత్పత్తులను అందించే నిర్ణయం తీసుకున్నామని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నాలుగు కోట్ల మందికి రేషన్ అందిస్తున్నట్లు గా ఆయన తెలిపారు.గ్యాస్ రాయితీ విషయంలో డిజిటల్ వారెంట్ కూపన్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar