విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: జమ్మూలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న తొమ్మిదవ జాతీయ స్థాయి పికిల్ బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు బయలుదేరింది. మాజీ మంత్రి,ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.గత నెల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సుజయ్ కృష్ణ రంగారావు పురుషుల విభాగంలోను అటు 50+ డబుల్స్ లో విజేతగా నిలిచి, జాతీయ స్థాయికి అర్హత సాధించారు. ఆయనతో పాటు బొబ్బిలికి చెందిన బదరి రావు 50+ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో జమ్ము జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించారు. వీరిద్దరూ కలసి జమ్మూలో 50+ డబుల్స్ విభాగంలో తలపడనున్నారు.వీరితోపాటు రాజాం నుండి కృష్ణం రాజు, అరుణ్ జంట 50+ డబుల్స్ విభాగంలో పోటీపడనుండగా, విజయవాడకు చెందిన శ్రీధర్ 35+ సింగిల్స్ విభాగంలో జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సంసిద్ధమయ్యారు.
Authored by: Vaddadi udayakumar