ఏపీ పోలీసులు సత్తా చూపిన మహిళ డిఎస్పి హర్షిత మణికంఠ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ పోలీసుల సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఓ మహిళా డీఎస్సీ ఏపీ పోలీసుల సత్తాను ప్రపంచ వేదికపై చాటారు.ఏపీ డీఎస్పీ హర్షిత మణికంఠ యూరోప్‌లోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు.5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన హర్షిత మణికంఠ. ఏపీ పోలీసులకు గర్వకారణంగా నిలిచారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు. ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గర్వకారణంగా నిలిపిన క్షణం అంటూ వంగలపూడి అనిత ఈ వివరాలను పంచుకున్నారు.మరోవైపు మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని ఐరోపాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా చెప్తారు. రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణిలో ఉంటుందీ పర్వతం .ఎల్బ్రస్ పర్వతం సముద్ర మట్టానికి 5,642 మీటర్లు ఎత్తులో ఉంటుంది.మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరం రెండు ప్రధాన శిఖరాలు కలిగి ఉంటుంది. పశ్చిమ శిఖరం 5,642 మీటర్లు ఎత్తు ఉంటే..తూర్పు శిఖరం 5,621 మీటర్లు ఎత్తు ఉంటుంది.అయితే ఏపీ డీఎస్సీ హర్షిత మణికంఠ పశ్చిమ శిఖరాన్ని అధిరోహించారు. ఈ నేపథ్యంలో ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ప్రపంచంలోని టాప్ 100 సిటీలలో హైదరాబాద్ 82వ స్థానం

మొదటి,రెండో స్థానంలో లండన్,న్యూయార్క్ మూడోస్థానం ప్యారిస్ హైదరాబాద్,చాన్విక జ్యోతిన్యూస్: హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోంది. ఫ్యూచర్ సిటీగా అంతర్జాతీయ స్థాయులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *