రోడ్డు ప్రమాదం మృతుని కుటుంబానికి 1 లక్ష 58 వేల నగదు అందచేత

పీఎంపాలెం ఎస్ఐ భాస్కరరావును అభినందించిన ఏసిపి, సీఐలు

మధురవాడ(విశాఖపట్నం),ఐఏషియన్ న్యూస్: పి.ఎం.పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. దీంతో మానవతా దృక్పథంతో పి.ఎం.పాలెం పోలీసుస్టేషన్ ఎస్.ఐ.భాస్కరరావు జరిగిన విషయాన్ని తన వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టారు. స్టేటస్ చూసిన ప్రతీ ఒక్కరూ స్పందించి ఎవరికి తోచిన వారు తమవంతుగా నగదు పంపించారు. సోమవారం సాయంత్రానికి 1 లక్ష 58 వేల రూపాయలు సమకూరింది.ఈ మొత్తాన్ని మృతుని కుటుంబసభ్యులకు ఏసీపీ అప్పలరాజు, సి.ఐ.బాలకృష్ణ సమక్షంలో అందజేశారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఎస్.ఐ.భాస్కరరావును ఏసీపీ అప్పలరాజు, సి.ఐ.బాలక్రిష్ణ అభినందించారు.

About admin

Check Also

విశాఖలో మహిళ దారుణ హత్య: నిందితుడు అరెస్ట్

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: విశాఖనగరంలోని అక్కయ్యపాలెం, నందగిరినగర్ ప్రాంతంలో నడిరోడ్డుపై మహిళ హత్య జరిగిన ఘటన బుధవారం విశాఖ నగరం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *