భారత ఉప రాష్ట్రపతి ధన్ ఖఢ్ రాజీనామా

న్యూ ఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: దేశ రాజకీయాల్లో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.కాగా, 2022 ఆగష్టు 11న ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు 1990-1991 వరకు కేంద్రమంత్రిగా, 2019 నుంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. కిసాన్ పుత్రగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. జనతాదళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ, లోక్‌సభ సభ్యుడుగా కూడా పనిచేశారు.

About I Asia News

Check Also

సుప్రీంకోర్ట్ అదనపు సొలిసిటర్ రా జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌కు కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్రకుమార్ ‌కు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *