తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ

చెన్నై,ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 14మంది నియమితులు కాగా ఈ జాబితాలో ఖుష్బూకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కుష్బూ కృతజ్ఞతలు తెలియజేసారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ప్రభుత్వ పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర

ఈ ఏడాది రాజకీయంగా ఎన్నో ఘన విజయాలు ఉద్యోగులు,ప్రజల మన్ననలు పొందిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ను ఆరాధ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *