వేపాడ (విజయనగరం),ఐఏషియ న్యూస్: విజయనగరం జిల్లా, వేపాడ మండలం, సింగరాయి గ్రామానికి చెందిన గేదల భాస్కరరావు తాత పేరిట సింగరాయి, గుడివాడ గ్రామాలలో 6 ఎకరాల వ్యవసాయ భూమి వున్నది.అయితే ఆ భూమిని గేదల భాస్కరరావు తండ్రి పేరిట,అతని బాబాయి పేరిట 1బి అడంగల్ లో మ్యుటేషన్ చేసి, వారివురి పేరున పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వీఆర్వో సచ్చిపోతే సంప్రదించారు. ఈ నేపథ్యంలో పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వడానికి సింగరాయి గ్రామ సచివాలయం రెవిన్యూ అధికారి శ్రీమతి కోతన సత్యవతి సదరు గేదల భాస్కరరావు వద్దనుండి రూ.1,00,000- లంచంగా డిమాండ్ చేశారు. అయితే బాధితుడు గేదల భాస్కరరావుకు ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక సదరు అధికారి శ్రీమతి కోతన సత్యవతి పై విజయనగరం ఎ.సి.బి. అధికారులకు ఫిర్యాదు చేసినాడు. విజయనగరం ఎ.సి.బి. అధికారులు ఫిర్యాదు చేశారు.దీనిపై కేసు నమోదు చేసి, శ్రీమతి కోతన సత్యవతి ఆ లంచం డబ్బులు లక్ష రూపాయలు, ఫిర్యాదు దారుడు వద్దనుండి తీసుకొంటుండగా, ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అరెస్టు చేసినారు.అరెస్టు కాబడిన సదరు గ్రామ సచివాలయం రెవిన్యూ అధికారి శ్రీమతి కోతన సత్యవతిని శుక్రవారం విశాఖపట్నం లోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుచున్న అవినీతిని గురించి ఎవరైనా సంభందిత జిల్లా ఎ.సి.బి అధికారులకు కాని లేదా ఎ.సి.బి టోల్ ఫ్రీ నెంబరు 1064 లేదా ఎ.సి.బి మొబైల్ నెం. 94404 40057 కు కాని లేదా ఎ.సి.బి ఈ-మెయిల్ ఐ.డి. నెం. complaints-acb@ap.gov.in కు కానీ తెలియపరచవచ్చు.
Authored by: Vaddadi udayakumar