హైదరాబాద్,ఐఏషియ న్యూస్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, క్రికెటర్ అజారుద్దీన్ ను ఎంపిక చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు చోటు దక్కింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు కేబినెట్ లోతీర్మానించి గవర్నర్ కు పంపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న అజారుద్దీన్ కు అనూహ్యంగా ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి.
Authored by: Vaddadi udayakumar