నల్లగొండ జిల్లా,ఐఏషియ న్యూస్: బాణసంచా దుకాణం నడపడానికి తాత్కాలిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఫిర్యాదుదారుడి నుండి 8వేల రూపాయలు లంచం తీసుకున్న ఘటన గురువారం జరిగింది.ఈ ఘటనలో నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి ఎ. సత్యనారాయణ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు.
వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడు తాత్కాలిక లైసెన్స్ కోసం ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (నాక్) పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ ప్రక్రియను వేగవంతం చేయాలంటే రూ.8,000/- లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎసీబీ అధికారులు వలవేసి సత్యనారాయణ రెడ్డిని లంచం తీసుకుంటూ పట్టుకున్నారు.ఎసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే “టోల్ ఫ్రీ నంబర్ 1064″కు కాల్ చేయాలని కోరారు. అంతేకాకుండా, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఎసీబీ అధికారులు స్పష్టం చేశారు.
Authored by: Vaddadi udayakumar