చెన్నై,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆయన మాతృమూర్తి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు. తనకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు.ఆయన లాగే నేను కూడా టీచర్ గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను రాష్ట్రపతి అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని తన భర్త అడిగారు.62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
Authored by: Vaddadi udayakumar