తెలుగు వైభవాన్ని ఖండాంతరాలకు చాటుతూ… అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని దసరా సంబరాలు……

న్యూజెర్సీ,ఐఏషియ న్యూస్: ఆటా ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఉన్న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. న్యూయార్క్, న్యూజెర్సీ, డెలావేర్, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 1200 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా దసరా సంబరాలను జరుపుకున్నారు.
దుర్గా పూజతో ప్రారంభమైన ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా సాగాయి. పూజ అనంతరం జమ్మి చెట్టు పూజ నిర్వహించి, ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆటా ప్రాంతీయ కోఆర్డినేటర్లు కృష్ణ మోహన్ మూలే, ప్రసాద్ ఆకుల, ప్రదీప్ రెడ్డి కట్టా అతిథులందరినీ సాదరంగా ఆహ్వానించారు.
భారత కాన్సులేట్ (న్యూయార్క్) నుండి మహేష్ యాదవ్ పాల్గొన్నారు. సాయిదత్త పీఠాధిపతి రఘుశర్మ గారు దుర్గామాత పూజలు నిర్వహించగా, రజిత ఆకుల ఆధ్వర్యంలో జరిగిన బొమ్మల కొలువు విశేష ఆదరణ పొందింది.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా గారు మరియు ఆటా ఎలెక్ట్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి గారు దసరా ఉత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విజయ కార్యక్రమం దసరా రోజున ప్రారంభిస్తే సఫలమవుతుందని వారు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆటా చేపట్టబోయే మెగా కార్యక్రమాల గురించి సభ్యులకు వివరించారు.
దసరా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రదీప్ రెడ్డి కట్టా, కృష్ణ మోహన్ మూలే, ప్రసాద్ ఆకుల, సంతోష్ కోరం, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, విలాస్ రెడ్డి జంబులకు సభాముఖంగా అభినందనలు తెలిపారు.
వచ్చే ఏడాది జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో ఆటా ఆధ్వర్యంలో జాతీయస్థాయి సదస్సు మరియు 19వ యువజన సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమాల కోసం ఆటా సభ్యులు, నిర్వాహకులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఆటా కార్యక్రమాలకు సహకరిస్తున్న సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. డల్లాస్, ఫిలడెల్ఫియా, వర్జీనియా, వాషింగ్టన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా నాయకులు హాజరయ్యారని, మీడియా సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.శరత్ రెడ్డి వేముల, సంతోష్ కోరం మాట్లాడుతూ, ఈ దసరా ఉత్సవాలకు “బలగం” చిత్రానికి బెస్ట్ లిరిక్స్ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ గారు, ఫోక్ సింగర్స్ రేలారే గంగా, దండేపల్లి శ్రీను, వ్యాఖ్యాత ఝాన్సీ రెడ్డి పాల్గొనడం ద్వారా కార్యక్రమానికి కొత్త ఊపు వచ్చింది అన్నారు.
ఆటా మహిళా విభాగం రీజినల్ చైర్ గీతా రెడ్డి, లలితా మూలే గారి ఆధ్వర్యంలో రామలీల ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కచేరీలు, పాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.
ఆటా సభ్యులు, పూర్వాధ్యక్షులు, ఎలెక్ట్ పరమేశ్ భీంరెడ్డి, పెర్కారి సుధాకర్ , డా. రాజేందర్ జిన్నా , బోర్డు కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ దార్గుల గారు, వినోద్ కోడురు, విజయ్ కుందూరు, సంతోష్ కోరం, రాజు కక్కర్ల, బాణాల శ్రీధర్, రఘువీర్ రెడ్డి మరిపెద్ది , శరత్ వేముల, శ్రీకాంత్ గుడిపాటి, రఘువీర్ రెడ్డి, పరుషురాం పిన్నపురెడ్డి, రవీందర్ గూడూర్, రాజ్ చిలుముల, హరీష్ బత్తిని, ప్రవీణ్ ఆలా, కిరణ్ ఆలా, రమేష్ మాగంటి, విజయ్ గంగుల, ప్రదీప్ , రవి పెద్ది తదితరులు ఉత్సవం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమానికి తానా, టిటిఏ, మాటా, నాట్స్, ఇండో అమెరికన్ కమ్యూనిటీ అలయన్స్, కళాభారతి, తెలుగు కళాసమితి, టీడీఎఫ్ నాయకులు మరియు వారి బృందాలు హాజరయ్యారు. అంతేకాక అనేకమంది ఇతర ప్రవాస తెలుగు నాయకులు కూడా పాల్గొన్నారు.

About admin

Check Also

అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం

వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు ఇల్లినాయిస్‌(యుఎస్),ఐఏషియ న్యూస్:  మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *