అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అమ్మ ఒడికి అమలు చేసిన నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ పథకం అమలు చేసారు.ముందుగానే జాబితాలను ప్రకటించి అర్హత ఉండీ, రాని వారికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.కాగా ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్ వాడీల్లో పని చేసే వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచన తో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు ప్రభుత్వం సాయం అందించింది. ఈ మేరకు వివరాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలపై శాసనమండలిలో జరిగిన చర్చలో పథకం అమలు గురించి వివరించారు.ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పామని. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించినట్లు వెల్లడించారు. గతంలో వైసీపీ పెట్టిన నిబంధనలనే తాము అమలుచేస్తున్నామని, 300 యూనిట్లు, ఆప్కాస్ ఉద్యోగుల నిబంధన, భూమి నిబంధనలు వైసీపీ హయాంలోనే విధించారని లోకేష్ గుర్తు చేసారు.
అర్హులందరికీ తల్లికి వందనం తప్పకుండా వర్తింపజేస్తామని, ఆశావర్కర్లు, అంగన్ వాడీ కుటుంబాలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపు విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించినట్లు వివరించారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు చేసిన తర్వాత తల్లికి వందనం అందజేస్తామని చెప్పామన్నారు. ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పామని వివరించారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం కూడా నగదు అందజేస్తోంది. రెండింటిని జోడించి నగదు జమచేస్తామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ రేషన్ కార్డులు కూడా మంజూరు చేశామనిఎవరైనా అర్హులు ఉంటే తల్లికి వందనం తప్పకుండా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
Authored by: Vaddadi udayakumar