స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్, జీసీసీ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
అమరావతి,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 11.35 గంటలకు విశాఖ చేరుకుంటారు. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ పేరుతో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆంధ్రా యూనివర్శిటీలోని సాగరికా ఫంక్షన్ హాల్లో హెల్త్ క్యాంపులను సీఎం సందర్శించనున్నారు. ఆ తర్వాత 12 గంటలకు ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువలుగా ప్రారంభించే స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ సభలో సీఎం పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లో గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బిజినెస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అక్కడే నెదర్లాండ్స్, ఫ్రెంచ్ దేశాలకు చెందిన ప్రతినిధుల బృందంతో చంద్రబాబు విడివిడిగా భేటీ అవుతారు. రాత్రి 07.40 గంటలకు విశాఖ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి బయలుదేరతారు.
Authored by: Vaddadi udayakumar