అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీసుల సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఓ మహిళా డీఎస్సీ ఏపీ పోలీసుల సత్తాను ప్రపంచ వేదికపై చాటారు.ఏపీ డీఎస్పీ హర్షిత మణికంఠ యూరోప్‌లోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు.5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన హర్షిత మణికంఠ. ఏపీ పోలీసులకు గర్వకారణంగా నిలిచారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు. ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గర్వకారణంగా నిలిపిన క్షణం అంటూ వంగలపూడి అనిత ఈ వివరాలను పంచుకున్నారు.మరోవైపు మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని ఐరోపాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరంగా చెప్తారు. రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణిలో ఉంటుందీ పర్వతం .ఎల్బ్రస్ పర్వతం సముద్ర మట్టానికి 5,642 మీటర్లు ఎత్తులో ఉంటుంది.మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరం రెండు ప్రధాన శిఖరాలు కలిగి ఉంటుంది. పశ్చిమ శిఖరం 5,642 మీటర్లు ఎత్తు ఉంటే..తూర్పు శిఖరం 5,621 మీటర్లు ఎత్తు ఉంటుంది.అయితే ఏపీ డీఎస్సీ హర్షిత మణికంఠ పశ్చిమ శిఖరాన్ని అధిరోహించారు. ఈ నేపథ్యంలో ఆమెను పలువురు అభినందిస్తున్నారు.
Authored by: Vaddadi udayakumar