ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈనెల 6న జరుగుతుందని సమాచారం అందుతోంది. దీనిలో భాగంగా పలువురు మంత్రుల శాఖల మార్పులు, చేర్పులతో పాటు కొంతమందిని మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనితను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈమెను మంత్రి పదవి తొలగిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్ది పాటి వెంకట రాజుకు మంత్రి పదవి అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందుతోంది. ఇక గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వివరాలు పరిశీలిస్తే మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గోపాలపురం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా దక్కలేదు.ఆయన ఆ తరువాత 2016లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకొని పూర్తిస్థాయిగా రాజకీయాలలోకి అడుగుపెట్టి పార్టీ కార్యక్రమాలను నిర్వహించాడు.వెంకటరాజు 2019లో టికెట్ ఆశించగా టికెట్ దక్కలేదు ఆ తరువాత పార్టీకి ఆయన సేవలకు గుర్తించి రాష్ట్ర లిడ్ క్యాప్ డైరక్టర్‌గా , నాయకత్వ శిక్షణ శిబిర డైరక్టర్‌గా నియమించింది.
- హోంమంత్రి అనిత అవుట్?
- గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజుకు మంత్రి పదవి…
మద్దిపాటి వెంకటరాజు ఆ తరువాత తెదేపా కార్యక్రమాల కమిటీ ఇన్‌చార్జ్‌గా నియమితుడై ఆ తరువాత 16 అక్టోబర్ 2022న గోపాలపురం శాసనసభ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు ఆయన 2024లో జరిగిన ఏపీ శాసనససభ ఎన్నికలలో గోపాలపురం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తానేటి వనితపై 26,784 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్టీ అభివృద్ధి కోసం వివిధ హోదాలలో సేవలందించిన వెంకటరాజుకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలనే తెలుగుదేశం అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ హోం మంత్రిగా తనదైన శైలిలో కష్టపడి పనిచేసిన కొన్ని తప్పిదాలు వల్ల వంగలపూడి అనితకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంత్రి పదవికి మంగళం పాడతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీగా ఎన్నికైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు ప్రముఖ సినీ నటుడు నాగబాబుకు మంత్రి పదవి ఈ విస్తరణలో దక్కుతుందో లేదో అని ప్రశ్నార్థకంగా మారింది.
Authored by: Vaddadi udayakumar