స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: దారం పోగును వస్త్రంగా మలచి,మనిషి మానాన్ని కాపాడేది చేనేత. చేనేత వస్త్రం కేవలం ఒక వస్తువు కాదు, అది మన సంస్కృతికి, సంప్రదాయానికి, కళాత్మకతకు ప్రతీక. మన అస్థిత్వాన్ని, అసలైన గుర్తింపును చాటిచెప్పే చేనేత వస్త్రాలను ధరించడం మనందరి బాధ్యత.జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 7న జరుపుకుంటాము. 1905లో ఇదే రోజున స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తువులను బహిష్కరించి,స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఆనాడు పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తితోనే, మన చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడి జీవించే …
Read More »Politics
25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఈనెల 25వ తేదీ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయని తెలిపారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాలుగు కోట్ల …
Read More »తిరుమల అన్నప్రసాద భవనాన్ని తనిఖీ చేసిన టిటిడి ఈవో శ్యామలరావు
తిరుమల,ఐఏషియన్యూస్: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టిటిడి భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యత,రుచిని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి సోమవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఈవో టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.భక్తులు టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.అంతకుముందు ఈవో,అదనపు ఈవోతో కలసి అన్న ప్రసాద భవనంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.తరువాత కియోస్క్ మిషన్ ద్వారా ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విరాళం అందించారు.అనంతరం …
Read More »15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట వ్యాప్తంగా మహిళలు,ట్రాన్స్‌జెండర్లు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి 6వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర రాష్ట్ర రవాణా,యువజన,క్రీడా శాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి అమరావతి,ఐఏషియ న్యూస్: కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల 15 న తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో …
Read More »జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్(81) కన్నుమూశారు.అనారోగ్యంతో ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో మృతి చెందారు.కొంతకాలంగా కిడ్నీసంబంధ సమస్యతో బాధపడుతున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సొరెన్ జార్ఖండ్ రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబుసోరెన్,జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో శిబు ఒకరు.శిబుసోరెన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »6న ఏపీ మంత్రివర్గం విస్తరణ….
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈనెల 6న జరుగుతుందని సమాచారం అందుతోంది. దీనిలో భాగంగా పలువురు మంత్రుల శాఖల మార్పులు, చేర్పులతో పాటు కొంతమందిని మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనితను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈమెను మంత్రి పదవి తొలగిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్ది పాటి వెంకట రాజుకు మంత్రి పదవి అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం …
Read More »13న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
హాస్పటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ వెల్లడి హైదరాబాద్,ఐఏషియ జ్యోతిన్యూస్: అమరావతిలో ఈ నెల 13న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, ప్రముఖ సినిమా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. అనంతవరం, తుళ్లూరు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించనున్నారు.అమరావతిలో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని దేశంలో ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని బాలకృష్ణ తెలిపారు.మూడు దశల్లో అమరావతిలో ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా …
Read More »స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ “కో చైర్మన్” గా ఉపాసన నియామకం
ఉపాసనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: మెగా వారి ఇంటి కోడలు, ప్రముఖ సినీ నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేసారు.సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు …
Read More »నావల్లే తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగం అభివృద్ధి
మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెండ్ల ఎదగడం నా చలవే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐఏషియ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధి టీడీపీ హయాంలోనే తన వల్లే జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్‌ను మొట్టమొదటిగా హైదరాబాద్‌కు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ల అక్కడి వరకు ఎదగడానికి నేను వేసిన బాటే మూలం” అని చెప్పారు. కాగా కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన ముఖ్యమంత్రి.గూడెంచెరువులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆటోలో ప్రజల …
Read More »ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జగదీప్ దన్‌ఖడ్ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసినట్లు సీఈసీ ప్రకటించింది. రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం.. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా లోక్‌సభ సభ్యులతో పాటు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారుసెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »