ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.14కే ఉల్లిపాయలు ఇస్తారు.. ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభిస్తారు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా త్వరలో (వీలును బట్టి ఇవాళ.. లేని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో) పంపిణీ చేస్తారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మొదటగా …
Read More »Politics
అమెరికాకు 88 దేశాల బిగ్ షాక్: అయోమయంలో ట్రంప్
వాషింగ్టన్ డిసి,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(ఎంఏజిఏ) అనే నినాదంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. అలా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలపై పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(ఎంఏజిఏ) లో భాగంగా దేశంలోని వలసవాదులను తిరిగి స్వదేశాలకు పంపించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు పేరుతో విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించి స్వదేశాలకు పంపించారు. అంతటితో ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై …
Read More »ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలు ఏపీ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం ఏపీ చీఫ్ బ్యూరో ఐఏషియ న్యూస్: అమరావతిలో గురువారంసమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ – పీఎంజేఏవై-డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్‌లో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు …
Read More »జిఎస్టి లో రెండు స్లాబ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం భారీగా రేట్లు తగ్గనున్న టీవీ,వాషింగ్ మెషిన్,ఏసీలు హెల్త్,లైఫ్ ఇన్సూరెన్స్ లకు జీఎస్టీ ఎత్తివేత ఏపీ చీఫ్ బ్యూరో, ఐఏషియ న్యూస్: ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీలో 12శాతం, 28శాతం స్లాబులను తొలగించి ఆ స్థానంలో కేవలం. 5శాతం, 18శాతం స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ …
Read More »బిఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన కెసిఆర్
హైదరాబాద్బీ,ఐఏషియ న్యూస్: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పై వేటు వేసారు. కొంత కాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు.. వివాదాలు తారాస్థాయికి చేరటంతో కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం సీబీఐకి కేసు అప్పగింత పైన స్పందించిన కవిత నేరుగా హరీష్, సంతోష్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వీటిని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీకి నష్టం చేసే విధంగా కవిత వ్యవహరించారనే కారణంతో పార్టీ …
Read More »విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం,ఆత్మీయవీడ్కోలు
విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఒక్కరోజు పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకుస్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది.మంగళవారం హెలికాప్టర్ ద్వారా బీచ్ రోడ్డులో గల కోస్టల్ బ్యాటరీ వద్ద హెలిపాడ్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ …
Read More »పెన్షన్ అనేది పేదలకు ఇచ్చే దానం కాదు… ప్రభుత్వ బాధ్యత..
తెలుగువారికి పెన్షన్ పరిచయం చేసింది ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు ప్రజలకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేశారు. రాజంపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా 30 రూపాయలతో 1983లో ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని పెట్టారన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అందిస్తుందని, అలాగే దివ్యాంగులకు . 6 వేలు, …
Read More »మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం
ఆస్ట్రేలియా ప్రభుత్వ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం ఆహ్వాన లేఖను పంపిన ఆస్ట్రేలియన్ హైకమిషన్ అమరావతి,ఐఏషియ న్యూస్: విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది.ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన …
Read More »సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజులు పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
తాడేపల్లి,ఐఏషియ న్యూస్: సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పులివెందుల లో పర్యటించనున్నారు. ఒకటవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. రెండవ తేదీన పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ …
Read More »గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం,క్రికెటర్ అజారుద్దీన్ ఎంపిక
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, క్రికెటర్ అజారుద్దీన్ ను ఎంపిక చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు చోటు దక్కింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు కేబినెట్ లోతీర్మానించి గవర్నర్ కు పంపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న అజారుద్దీన్ కు అనూహ్యంగా ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారో …
Read More »