న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర క్యాబినెట్ బుధవారం సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం. బోనస్ కోసం రూ.1866 కోట్లు కేటాయింపు. గ్రూప్-సి, గ్రూప్-డి కేటగిరీలో 10.61 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.రూ.95 వేల కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం కేబినెట్ ఆమోదం. 30 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం.దేశంలో మెడికల్ విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు పెంపు. సి ఎస్ ఎస్ పథకం-3 కింద 5,000 కొత్త పీజీ సీట్లు. కేటాయించారు.5,023 అదనపు ఎంబిబిఎస్ సీట్ల మంజూరు. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు ఖర్చు పరిమితి పెంపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునికీకరణకు సహాయం చేస్తారు.నూతన స్పెషాలిటీ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమం.దేశంలో పెరగనున్న స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య.
Authored by: Vaddadi udayakumar