వివాహానికి హాజరైన అంబటి రాంబాబు దంపతులు
ఇల్లినాయిస్(యుఎస్),ఐఏషియ న్యూస్: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.అమెరికాలో అంబటి రాంబాబు దంపతులు, బంధువులు వరుడి తరఫు బంధువుల సమక్షంలో ఇల్లినాయిస్‌లోని మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతుల్లో వివాహ వేడుక చేశారు. డాక్టర్ శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు. వరుడు జాస్తి హర్ష అమెరికాలో డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అంబటి అల్లుడు హర్దదిపశ్చిమగోదావరి జిల్లా తణుకు కాగా ఆయనది కమ్మ సామాజిక వర్గం. శ్రీజ, హర్షలను అంబటి రాంబాబు అందరికి పరిచయం చేశారు. తన అల్లుడి గురించిన వివరాలు సరిగా తెలియదని తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందన్నారు. ఈపెళ్లి ఏపీలో పెళ్లిచేయాలనుకున్నామని..ట్రంప్ దెబ్బకు (వస్తే మళ్లీ వెనక్కు రానివ్వరేమోనని ఆలోచించి) అమెరికాలోనే వివాహం చేయాల్సి వచ్చిందన్నారు.వరుడు హర్ష తల్లిదండ్రులు వివాహానికి రాలేకపోయారని వారికి వీసా సమస్యలు ఎదురైనట్లు అంబటి తెలిపారు.మూడుసార్లు ప్రయత్నం చేసినా వీసా రాలేదన్నారు.అందుకే వారు లైవ్‌లో పెళ్లి చూడాల్సి వచ్చిందన్నారు. వీళ్లిద్దరు ఏపీకి వచ్చిన సమయంలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తామన్నారు.
Authored by: Vaddadi udayakumar