రాజ్యాధినేతలు,రాజకీయ అగ్రనేతలపైనా గ్రహణ ప్రభావం
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం చాలా అరుదైనదని, అంతేకాకుండా అత్యంత అద్భుతమనదని ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య సిద్దాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ తెలియజేశారు. సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం అగ్ర రాజ్యాధినేతలు, రాజకీయాలలో అత్యంత ఉన్నతమైన స్థానాలలో వుండే వారిపై కూడా ఉంటుందన్నారు. అలాగే వాతావరణం, భూకంపాలు, రాజకీయ అస్థిరతలు మొదలైనవి వుండునని గార్గేయ తెలియజేసారు. గ్రహణ ప్రభావం సాధారణ ప్రజలపైగాని, ద్వాదశరాశుల వారిపై వ్యతిరేక ప్రభావం ఉండదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అపోహ సమాచారాన్ని నమ్మ వద్దని గార్గేయ సూచించారు.భాద్రపద పూర్ణిమ నాడు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో రాహుగ్రస్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనపడుతుందన్నారు.
సంపూర్ణ గ్రహణం రాత్రి 11 గంటల నుంచి 12.22 గంటల వరకు కనపడును. అనగా 82 నిమిషాలు.ఈ 82 నిమిషాలలోనే ప్రతివారు తమ భవిష్య స్థితిగతుల గురించి చక్కని ఆలోచనలు చేయగలిగితే చంద్రుడు మహా అద్భుత విజయాలను అందించగలడు. ఇలాంటి గ్రహణం అత్యంత అరుదుగానే కుంభరాశిలో మాత్రమే జరుగును. ఇతర రాశులలో ఇలాంటి గ్రహణం రానేరాదు. దీని వ్యతిరేక ప్రభావాలు కుంభరాశివారిపై వుండనే వుండవని గార్గేయ స్పష్టం చేశారు.
Authored by: Vaddadi udayakumar