- ఒంటిపై కోటి విలువైన బంగారు ఆభరణాలు
- స్వామివారిని మూడో శనివారం దర్శనం
- భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం
వాడపల్లి,ఐఏషియ న్యూస్: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి విజయవాడ నుంచి గోల్డ్ మాన్ వచ్చారు ఈ శనివారం మూడోసారి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సుమారు కోటి రూపాయలు విలువైన బంగారు ఆభరణాలను ఆ యువకుడు (గోల్డ్ మాన్) ధరించి ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. విజయవాడకు చెందిన శంకరనారాయణ అనే భక్తుడు ఏడు శనివారాల మొక్కుబడి తీర్చుకోవడానికి విజయవాడ నుంచి ఇక్కడికి వస్తున్నారు.మెడలో లావైన గొలుసులు, చేతి వేళ్ల నిండా ఉంగరాలు, బంగారు వాచి,పెద్ద బ్రాస్లైట్ వంటి సుమారు కేజీ బరువు ఉన్న బంగారు ఆభరణాలు ఈయన ధరించారు. స్వామివారి మహిమ తెలుసుకుని తాను కూడా ఏడు శనివారాలు రావడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అనేక మంది భక్తులు పోటీపడ్డారు.
Authored by: Vaddadi udayakumar