అమరావతి,ఐఏషియ న్యూస్:ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమరావతి దగ్గరలో గల 300 అడుగుల నీరుకొండ కొండపై బేస్ 100 అడుగులతోపాటు 200 అడుగుల ఎత్తుగల విగ్రహం నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డి పి ఆర్ టెండర్లు ఆహ్వానించింది. ఈ విగ్రహం బేస్ లో మ్యూజియం,మినీథియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఉండేలా నిర్మాణం చేపడతారు.యాక్సెస్ కోసం ఎస్కలేటర్లు లిఫ్ట్లునిర్మిస్తారు.
Authored by: Vaddadi udayakumar