అమరావతి,ఐఏషియ న్యూస్: వినాయక చవితిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా యువత, ఉత్సవ కమిటీలు వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వినాయకచవితికిమాత్రమేకాదు.విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చి్ంచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు.వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు,మండపాల నిర్వాహకులకు శుభవార్త. వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో చర్చించాను. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయనుంది.రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తాం. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు కూటమి ప్రభుత్వం వెచ్చించనుంది. అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Authored by: Vaddadi udayakumar