విశాఖపట్నం,ఐఏషియ న్యూస్ బ్యూరో: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, పలువురు అధికారులు అధ్యయన యాత్రకు మంగళవారం విశాఖ నుండి బయలుదేరి వెళ్లడం జరిగిందని జీవీఎంసీ కార్యదర్శి బి.వి. రమణ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతోపాటు 82 మందికార్పొరేటర్లు, పలువురు అధికారులుమంగళవారంవిశాఖవిమానాశ్రయం నుండిఅధ్యయనయాత్రకుబయలుదేరారని, వీరిలో 43 మంది మహిళా కార్పొరేటర్లు అధ్యయన యాత్రలో వున్నారన్నారు. కార్పొరేటర్ల బృందం 16వ తేదిన విశాఖపట్నంలో బయలు దేరి 24వ తేదీ వరకు జైపూర్, జోధపూర్, జై సల్మార్, ఢిల్లీ ప్రాంతాలలోని మున్సిపల్ కార్పొరేషన్ లు అక్కడ ప్రాజెక్టులను అధ్యయనం చేసిన అనంతరం నగరానికి రావడం జరుగుతుందని కార్యదర్శి తెలిపారు.ఈ అధ్యయన యాత్రలో జీవీఎంసీ కార్యదర్శి బి.వి.రమణ, మెడికల్ ఆఫీసర్,డాక్టర్.వాసుపల్లికనకసాయికళ్యాణ్, రెవెన్యూ ఆఫీసర్ టి.నాగేంద్ర కుమార్,అకౌంట్స్ ఆఫీసర్ వి. నారాయణరావు,సహాయక ఇంజనీరు జి.సురేష్ తదితరులు కార్పొరేటర్లతో కలిసి అధ్యయన యాత్రలో పాల్గొంటారు.
కార్పొరేటర్ల విహారయాత్ర ఇదే వారి చివరి అధ్యయన యాత్ర
జీవీఎంసీ కార్పొరేటర్లు పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు కార్పొరేటర్లకు అధ్యయన యాత్రను ఏర్పాటు చేశారు. జైపూర్,న్యూఢిల్లీతో సహా పలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ లో పనితీరు, పథకాలు స్వయంగా ఈనెల 24 వరకు పరిశీలిస్తారు.అయితే జీవీఎంసీ పరిధిలో 98 మంది కార్పొరేటర్లు ఉండగా కేవలం 82 మంది మాత్రమే ఈ విహారయాత్రలో (అధ్యయన యాత్ర) పాల్గొంటున్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్పొరేటర్ల బృందం విశాఖ నుంచి మంగళవారం బయలుదేరింది. ఎలాగూ తమ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ అధ్యయన యాత్రను పార్టీలకు అతీతంగా అంటే టిడిపి, జనసేన, వైసిపి కార్పొరేటర్లు తమకు అనుకూలంగా విహారయాత్రగా మార్చుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసిపి మేయర్ ను పదవి నుంచి దించి టిడిపి ఆ పదవి చేజిక్కించుకొని జీవీఎంసీ పరిపాలన చేస్తోంది. టిడిపి అక్రమంగా పదవి పొందిందని వైసీపీ ఒకపక్క విమర్శిస్తూ ఉంటే అదే పార్టీకి చెందిన డిప్యూటీ జియ్యని శ్రీధర్ ఈ అధ్యయన యాత్రలో పాల్గొనడం సర్వత్ర చర్చనీయంగా మారింది. ఈ అధ్యయన యాత్రను ఈయన వ్యతిరేకిస్తారు అనుకుంటే ఈయన కూడా ఈ అధ్యయన యాత్రలో పాల్గొనడం వైసిపి పార్టీ లో పలువురు విస్తుపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ అధ్యయన యాత్ర పేరిట సుమారు రెండు కోట్ల రూపాయలుప్రజాధనందుర్వినియోగంజరుగుతుందని ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లు ఆరోపించడం తెలిసిందే.
సీఎం చంద్రబాబు విశాఖ నగర పర్యటనను విస్మరించిన మేయర్ పీలా
విశాఖ నగర వేదికగా బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు రానులను నేపథ్యంలో వీరిని విశాఖ నగర ప్రథమ పౌరుడు జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు ఘన స్వాగతం పలకాల్సి ఉంది. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని పక్కనపెట్టి కార్పొరేటర్లతో అధ్యయన యాత్ర పేరిట ఆయన మంగళవారం విమానంలో జైపూర్ పయనమయ్యారు.ఈయన వైఖరి టిడిపి నాయకులకు మింగుడుపడలేదు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారని టిడిపి నాయకులు ఒకింత మదన పడుతున్నారు.
Authored by: Vaddadi udayakumar