అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నెల ముందుగానే ఫిబ్రవరిలో పరీక్షల నిర్వహణకు నిర్ణయించింది.పరీక్షా విధానంలోనూ మార్పులు తెచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఇకపై రోజుకు ఒక్క సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి. మొదట సైన్స్ గ్రూపులకు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పైన మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
నెల ముందే పరీక్షలు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ విద్యాసంవత్సరంలో ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రణాళికలో సిద్దమైంది. సాధారణంగా ప్రతీ ఏటా మార్చినెలలోఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి.కాగా,ఈసారి సీబీఎస్‌ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో తరగతులను నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలన్నీ పూర్తవుతాయి. అందుకు అనుగుణంగానే పరీక్షల విధానంలోనూ పలు మార్పులు జరిగాయి.
Authored by: Vaddadi udayakumar