న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్‌సీఎల్) అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్, సరికొత్త ‘సేవింగ్స్ ప్రో’ ఖాతాలను తీసుకొచ్చింది. ఈ బ్యాంకు ఖాతాల్లోని అదనపు నిధులపై వినియోగదారులకు 6.5 శాతం వరకు వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రారంభ దశలో రూ.5000 నుంచి కనీస మొత్తాన్ని వినియోగదారులు ఎంపిక చేసుకోవాలి. ఈ మొత్తానికి అదనంగా ఉండే సొమ్మును ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్లలో నేరుగా పెట్టుబడి పెడతారు. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు రోజుకు రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతాదారులు తమ పెట్టుబడుల్లో 90శాతం వరకు తక్షణమే రెడీమ్ చేసుకోవచ్చు. గరిష్ఠ తక్షణ రిడెమ్షన్ పరిమితిని రూ.50,000గా విధించారు. ఈ మొత్తం కంటే ఎక్కువ సొమ్ము కావాలంటే 1-2 పని దినాల సమయం పడుతుంది.
Authored by: Vaddadi udayakumar