ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం..ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగు గ్రామీణ బ్యాంకులు విలీనం చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులు పాటు గ్రామీణ బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు గ్రామీణ బ్యాంక్ యాజమాన్యం గురువారం ఒక పర్యటన జారీ చేశారు.ఒకే గొడుగు కిందకు ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు తీసుకురానున్నారు. విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం కలుగుతుంది.
ఈ నెల 9న‌ సాయంత్రం 6 నుంచి 13 ఉదయం 10 వరకు లావాదేవీలు నిలిచిపోతాయి.ఏటీఎం, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా పనిచేయవని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యాజమాన్యం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు తమకు సహకరించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హైదరాబాద్ కోకాపేటలో ఎకరం 137 కోట్ల 25 లక్షలు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లోని కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ.137 కోట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *