హైదరాబాద్,ఐఏషియ న్యూస్: వినాయక చవితి పర్వదినం అంటే తెలుగు ప్రజలందరికీ ఆధ్యాత్మిక ఉత్సాహం, భక్తి పరవశం. అలాంటి పవిత్ర సందర్భంలో హైదరాబాద్ నగర పరిధిలో గల ఖైరతాబాద్ మహాగణపతి ఆరాధనీయ స్వరూపంలో కొలువుదీరి, భక్తుల మనసుల్లో భక్తి స్ఫూర్తిని నింపుతున్నాడు.63 అడుగుల ఎత్తులో మహిమామూర్తిగా నిలిచిన మహాగణపతి, ఎర్రటి కనులతో భక్తుల్ని కరుణా దృష్టితో చూస్తూ, గోకులంలో గోపాలుడిలా, మందిరంలో దేవుడిలా భక్తుల హృదయాలను హత్తుకుంటున్నాడు. తెల్లవారుజామున మొదలైన మంత్రోచ్ఛారణలు, ఘంటానాదాలు, “గణనాథ శరణం” నినాదాలు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించాయి.
Authored by: Vaddadi udayakumar