విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఏఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి అంచలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి నేడు తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇక శివధర్ రెడ్డి వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంతు లేకలాన్ (పెద్దతూండ్ల) గ్రామం.తల్లిదండ్రులు వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు. శివధర్రెడ్డి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లో సాగింది. ఐపీఎస్ కావడానికి ముందు ఆయన ఓయూలో ఎల్ఎల్బీ చదివి కొంతకాలం న్యాయవాదిగా కూడా పని చేశారు. ఆ తర్వాత సివిల్స్ రాసి 1994 బ్యాచ్ ఐపీఎస్ సర్వీసులోకి అడుగుపెట్టారు. మొట్టమొదటిసారిగా ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఏఎస్పీగా పనిచేశారు. ఆపైన అంచులంచలుగా వివిధ ప్రాంతాల్లో పనిచేసి విశాఖ పోలీస్ కమిషనర్ గా కూడా విధులు నిర్వహించారు.డీఐజీగా ప్రమోషన్ పొందిన తర్వాత శివధర్ రెడ్డి ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమితులయ్యారు. అలానే ఉమ్మడి ఏపీలో ఏసీబీలో అడిషనల్ డైరెక్టర్‌గా. ఆ తర్వాత అక్కడే ఐజీ హోదాలో డైరెక్టర్‌గా కూడా పని చేశారు.ఆయన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో కూడా విధులు నిర్వర్తించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో విశాఖ నగర కమిషనర్‌గా ఉన్న శివధర్‌రెడ్డిని అప్పటి సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారు.ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నపుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నయీం చనిపోయాడు. 2023లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా తిరిగి నియామకం చేశారు.ఇంటిలిజెంట్ చీఫ్ గా పనిచేస్తున్న శివధర్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు.
Authored by: Vaddadi udayakumar