న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సహకారం మరింతగా పొందడానికి, రాష్ట్ర ఐటీ, విద్య, హెచ్ ఆర్ డి మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని సోమవారం టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంకు ఆహ్వానించినట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు.మంత్రి నారా లోకేష్ తో ఎంపీ శ్రీభరత్ , తోటి సహచర ఎంపీలు కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలకమైన పలు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు.ఈ సమావేశాల్లో ఎంపీ శ్రీభరత్ తో పాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి శ్రీ పెమ్మసాని చంద్ర శేఖర్, టిడిపి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లావు కృష్ణ దేవరాయలు, ఇతర సహచర టిడిపి ఎంపీలు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar