బనగానపల్లె/నంద్యాల,ఐఏషియ న్యూస్: బీహార్ రాష్ట్రం బోద్ గయలో ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే 44వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు బనగానపల్లెలోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ తొమ్మిదవ తరగతి విద్యార్థి లోకేష్ యాదవ్ ఎంపికైనట్లు కరస్పాండెంట్ కోడూరు హరినాథ్ రెడ్డి తెలిపారు. తమ విద్యా సంస్థలు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు మొదలగు వాటిలో మెరుగుపడేందుకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ఎంపికైన విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ జాతీయస్థాయి పోటీల్లోరాణించాలన్నారు.విద్యార్థి ఎంపికకు విశేషంగా కృషిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజును ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోడూరు కమల్ తేజా రెడ్డి, డైరెక్టర్,కోడూరురవితేజారెడ్డి,వ్యాయామోపాధ్యాయులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar