North American Telugu Society Dallas Telugu Vedukalu 2024

డల్లాస్‌లో అంగరంగ వైభవంగా నాట్స్ తెలుగువేడుకులు వేడుకల్లో 10వేల మందికిపైకి తెలుగు వారుడల్లాస్‌ నాట్స్ తెలుగువేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారు పది వేల మందికి పైగా విచ్చేశారు. తెలుగు ఆట, పాటలతో ఆద్యంతం వినోద భరితంగా సాగిన తెలుగు వేడుకలు డల్లాస్‌లో తెలుగువారికి మధురానుభూతులను పంచాయి. ప్రముఖ సినీ గాయకుడు కార్తీక్ పాటల ప్రవాహంలో తెలుగు ప్రజలు తడిసి ముద్దయ్యారు. కార్తీక్ పాటకు లేచి మరీ చిందులేస్తూ వారిలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇదే తెలుగు వేడుకల వేదికపై ప్రముఖ నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది.  దీంతో పాటు ప్రముఖ కవి కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రికి కూడా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించి దానిని వారి కుటుంబ సభ్యులకు అందించింది. స్థానిక శ్రీచక్ర కళా నిలయం, రాగమయూరి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ శాస్త్రీయ నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఐక్య బ్యాండ్, మధురాజ్ డ్యాన్స్ గ్రూపు తెలుగుపాటలకు డ్యాన్స్ వేసి ప్రేక్షకుల్లో జోష్‌ని నింపారు. రోబో గణేశన్ ప్రదర్శన కూడా అందరిని అలరించింది. డల్లాస్ తెలుగు వేడుకల వేదికపై నాట్స్ స్టూడెంట్స్ స్కాలర్ షిప్‌లను అందించారు. నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల కన్వీనర్ రాజేంద్ర మాదాల అభినందించారు.. సమిష్టి కృషి వల్లే వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు. నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో నాట్స్ నాయకులు, వాలంటీర్లు చక్కటి సమన్వయంతో పనిచేశారని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రశంసించారు. డల్లాస్‌లో నాట్స్‌ ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగు ప్రజలు ఆ కార్యక్రమానికి ఇస్తున్న మద్దతు, ఆదరణ మరువలేనిదన్నారు. డల్లాస్ నాట్స్ తెలుగు వేడుకలను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About admin

Check Also

ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యం తిరుమ‌ల కొండ పైవ‌ర‌కు పొడిగింపు

ఆర్టీసీ చైర్మన్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు తిరుమల,ఐఏషియ న్యూస్: ఏపీలో ‘స్త్రీశ‌క్తి’ పేరుతో ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యంఈనెల 15 నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *