- జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్
- దక్షిణ నియోజకవర్గ యువతీ యువకులు సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈనెల 22న ఉదయం 9 గంటలకు జైలు రోడ్డు వద్దగల ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో దాదాపు 30 కంపెనీలు పైగా 1,000 మంది పైగా ఉద్యోగాలు కల్పించడం కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను రాష్ట్రమంత్రి పి ఎస్ సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులు కు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని,ఈ జాబ్ మేళా ద్వారా యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ,రూరల్ జనసేన అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్ , డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి , రాష్ట్ర చైర్మన్ గంగులయ్య ,నార్త్ ఇన్చార్జి శ్రీమతి ఉషాకిరణ్, వెస్ట్ ఇన్చార్జ్ శ్రీమతి ప్రశాంతి ,చోడవరం ఇంచార్జి రాజు, జనసేన డాక్టర్ సెల్ రాష్ట్ర చైర్మన్ రఘు,రాష్ట్ర చైర్మన్ పాలవలస యశస్విని,జనసేన పార్టీ సౌత్ నియోజకవర్గం ఇంచార్జి శివప్రసాద్ రెడ్డి , జనసేన పార్టీ యువనేత డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చాముండేశ్వరిరావు, రమేష్ , మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి మంజుల పాల్గొన్నారు.నైపుణ్యం పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి అడ్మిట్ కార్డుతో హాజరు కావాలి.స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది.ఆధార్ లింకే్డ్ మొబైల్ నెంబర్ తో హాజరుకాగలరు.
Authored by: Vaddadi udayakumar