న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్, చైనా పర్యటనల అనంతరం జరుగుతున్న భేటీ కావడంతో విదేశీ పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలు, భారత్ పై సుంకాలు విధింపు.. తదితర అంశాలనూ ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా వరదలు.. ముఖ్యంగా పంజాబ్ లో ఆకస్మిక వరదలపైనా ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ చర్చించినట్లు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. శనివారం సాయంత్రం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో జపాన్, చైనా పర్యటన తర్వాత రాష్ట్రపతి, ప్రధాని మోదీ మధ్య జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీ ప్రత్యేకతను సంతరించుకుంది. చైనాలోని తియాంజిన్ వేదికగా జరిగిన ఎస్ సీ ఓ సమావేశంలో ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇరు దేశాలతో పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు.
Authored by: Vaddadi udayakumar