పీఎంపాలెం ఎస్ఐ భాస్కరరావును అభినందించిన ఏసిపి, సీఐలు
మధురవాడ(విశాఖపట్నం),ఐఏషియన్ న్యూస్: పి.ఎం.పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. దీంతో మానవతా దృక్పథంతో పి.ఎం.పాలెం పోలీసుస్టేషన్ ఎస్.ఐ.భాస్కరరావు జరిగిన విషయాన్ని తన వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టారు. స్టేటస్ చూసిన ప్రతీ ఒక్కరూ స్పందించి ఎవరికి తోచిన వారు తమవంతుగా నగదు పంపించారు. సోమవారం సాయంత్రానికి 1 లక్ష 58 వేల రూపాయలు సమకూరింది.ఈ మొత్తాన్ని మృతుని కుటుంబసభ్యులకు ఏసీపీ అప్పలరాజు, సి.ఐ.బాలకృష్ణ సమక్షంలో అందజేశారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఎస్.ఐ.భాస్కరరావును ఏసీపీ అప్పలరాజు, సి.ఐ.బాలక్రిష్ణ అభినందించారు.